నిరీక్షణ

నిరీక్షణ
నిరీక్షణ
నే రాసే ప్రతి అక్షరం లో ప్రయత్నిస్తున్నా,
నీపై ప్రేమను తెలుపుదామని
కానీ, అది నీవే చెప్పాలనే ఆశ తో
నిరీక్షిస్తున్నా నీ కోసం .......!

నిను తాకే గాలినే శ్వాసిస్తున్నా,
నాపై ప్రేమని శ్వాస లోనైనా పంచుతావని.....

నీ చూపుల్లోనే పయనిస్తున్నా,
నాపై ప్రేమ కనిపిస్తుందేమోనని......

నీ ప్రతి అడుగు లో వెతుకుతున్నా,
నాపై ప్రేమ గుర్తులేమైనా ఉన్నాయేమోనని ......


నీవు కూర్చునే  ప్రతీ చోటా చూస్తున్నా,
నాపై ప్రేమ భావనేమైనా వదిలెల్లావేమోనని .......


నీ జ్ఞాపకాల వర్షం లో తడుస్తున్నా,
నీవొచ్చి ప్రేమ గొడుగు పడతావేమోనని......

 
స్వాతి చినుకుల్లాంటి నీ మాటల్లో వెతుకుతున్నా, కానీ,
అవి నా చెవులకు వినబడకుండా హృదయానికి జారుతున్నాయి.. ముత్యాల్లా...

అయినా..

నీ కళ్ళలోనే తెలుస్తోంది.... నా ఫై నీ ప్రేమ....
నిరీక్షిస్తున్నా ఓ చెలీ.... నీవేనాడైనా చెబుతావనే ఆశతో...... 

0/Post a Comment/Comments

Previous Post Next Post