ఎక్కడున్నావు?

ఎక్కడున్నావు?
ఎక్కడున్నావు?
ఆకాశం వంక చూస్తూ
నీలి మబ్బుల కదలిక కు మురిసిపోతున్నాను,
ఎక్కడైనా నీ రూపం కనిపిస్తుందేమోనని.


చిరుగాలికి ఊగే పువ్వుల్లో వెతుకుతున్నా,
ఒక్కసారైనా నీ మోము కనిపిస్తుందేమోనని.


తొలకరి చినుకుల జల్లు ని నిశ్శబ్దంగా వింటున్నా,
నీ నవ్వుల వర్షం కురుస్తుందేమోనని.


ఎక్కడున్నావు ప్రియా............?

0/Post a Comment/Comments