CPEC పై ఇండియాకున్న అభ్యంతరాలేమిటి?

CPEC పై ఇండియాకున్న అభ్యంతరాలేమిటి?
CPEC పై ఇండియాకున్న అభ్యంతరాలేమిటి? 
చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) - 46 బిలియన్ డాలర్ల వ్యయం తో చైనా ప్రతిష్టాత్మకంగా పాకిస్తాన్ లో నిర్మిస్తున్నప్రాజెక్ట్. దీనిలో భాగంగా పాకిస్తాన్ లోని గ్వాదర్ పోర్ట్ నుండి చైనా లోని క్సిన్జియాంగ్ ప్రావిన్స్ వరకు దాదాపు 2500 కిలోమీటర్ల దూరం రవాణా సౌకర్యాలు కల్పించటమే కాకుండా రహదారుల వెంబడి విద్యుత్ ప్రాజెక్టులు, చమురు శుద్ధి కేంద్రాలు, చమురు రవాణా పైప్ లైన్లు మరియు ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్ ఏర్పాటు చేయనున్నారు. ఇది ఇప్పటి వరకు పాకిస్తాన్లో అమలవుతున్నఅతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. ఈ ప్రాజెక్ట్ తమ దేశ ఆర్ధిక స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తుందనే అభిప్రాయం అక్కడి సామాన్య ప్రజల్లో ఉంది. చైనా కు మాత్రం ఇది యూరప్, మధ్య ఆసియా, ఆఫ్రికా ల నుండి ఎగుమతి దిగుమతుల కొరకు భారత దేశాన్ని చుట్టి మలక్కా జలసంధిని దాటాల్సిన అవసరాన్ని తప్పించనుంది.  

చైనా వన్ బెల్ట్ - వన్ రోడ్ విధానం లో భాగంగా నిర్మిస్తున్న ఈ CPEC ని,  మన దేశం ఆది నుండి వ్యతిరేకిస్తూనే వుంది. వివిధ సందర్భాల్లో మన విదేశాంగ మంత్రులు, రాయబారులు బాహాటంగా తమ నిరసన ను కూడా వ్యక్తం చేసారు. మన దేశ వ్యతిరేకతకు కారణాలు ఇవీ.... 

CPEC రహదారులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతాల గుండా వెలుతున్నాయి. భారత దేశం తమదిగా భావించే/ చెప్పుకునే ఈ ప్రాంతం లో పాకిస్తాన్ ప్రభుతం వ్యూహాత్మకంగానే చైనా సహకారం తో ఇలాంటి నిర్మాణాలు చేస్తుందని మన దేశం అంటుంది. చైనా ప్రభుత్వం మాత్రం తాము దీనిని కేవలం వ్యాపార ఉద్దేశ్యం తోనే నిర్మిస్తున్నామని, ఏ దేశానికి వ్యతిరేకం కాదనీ వాదిస్తోంది. 

గ్వాదర్ పోర్ట్ చైనా అధీనంలో ఉంటే హిందూ మహా సముద్ర ప్రాంతం లో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటుందని మనదేశం భావిస్తుంది. మన దేశానికి సమీపంలోని ఈ పోర్ట్ ని  రవాణాకే కాకుండా చైనా తమ సైనిక స్థావరంగా మార్చుకుంటుందేమోనని మన దేశ భయం. 

తమ దేశ ఆర్ధిక వృద్ధిని అడ్డుకోవటానికే , ఇండియా CPEC కి వ్యతిరేకంగా బలూచిస్తాన్, గిల్గిట్-బాల్టిస్థాన్ లలోని ఉగ్రవాదులకు, వేర్పాటు వాదులకు మద్దతు పలుకుతోందని, సహకారం అందజేస్తుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post