ఇది ఖచ్చితంగా అద్భుతమే |
బ్రెజిల్ లోని రియోడిజెనీరో లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో మునుపెన్నడు చూడని ఒక అద్భుతం జరిగింది. పాక్షిక అందుల విభాగం (T 13) లో జరిగిన 1500 మీటర్ల పరుగు పందెంలో ఇది చోటు చేసుకుంది. ఈ విభాగం ఫైనల్లో పోటీపడిన వారిలో నలుగురు గత నెలలో జరిగిన సాధారణ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ సాధించిన టైమింగ్ కంటే మంచి టైమింగ్ నమోదు చేయటం విశేషం.
అల్జీరియా కు చెందిన అబ్దుల్ లతీఫ్ బాకా 1500 మీటర్లను మూడు నిమిషాల 48.29 సెకెన్ల లో పూర్తి చేసి స్వర్ణం సాధించాడు. గత నెలలో సాధారణ ఒలింపిక్స్ లో గోల్డ్ సాధించిన సెంట్రోవిచ్ (అమెరికా - 3 నిమిషాల 50 సెకన్లు) కన్నా ఇది 1.7 సెకన్లు తక్కువ కావటం విశేషం. ఇంకా పారా ఒలింపిక్స్ లోని ఈ విభాగంలో తమిరు దిమ్మెస్సే (ఇథియోపియా - 3 నిమిషాల 48.49 సెకన్లు) రజతం, హెన్రీ కిర్వా (కెన్యా - 3 నిమిషాల 49.59 సెకన్లు) కాంస్యం, లతీఫ్ బాకా సోదరుడైన ఫవాద్ బాకా 3 నిమిషాల 49.84 సెకన్ల తో నాలుగవ స్థానం సాధించారు. వీరందరూ సాధారణ ఒలింపిక్స్ లో పోటీపడి ఇదే టైమింగ్ సాధించగలిగితే తొలి నాలుగు స్థానాలు వీరికే దక్కేవి.
Post a Comment