0
అమరావతి సీడ్‌ క్యాపిటల్‌కు రోడ్లు
అమరావతి సీడ్‌ క్యాపిటల్‌కు రోడ్లు
రాజధాని అభివృద్ధి కమిటీ (CRDA) తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రహదార్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాయపూడి నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు 21.5 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి టెండర్లు పిలవటానికి ఆమోదం తెలిపారు.

అమరావతి లోని సీడ్‌ క్యాపిటల్‌ను అనుసంధానించే ఈ రహదారిని సీడ్‌ యాక్సిస్‌ రహదారి గా వ్యవహరించనున్నారు. దీనిలో మెట్రో, బీఆర్‌టీఎస్‌ తో కలిపి నాలుగు లైన్ల రోడ్డు నిర్మించనున్నారు. ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున ఆరు లైన్ల ఫ్లై ఓవర్‌ కూడా దీనిలో భాగంగా నిర్మించనున్నారు. మొదటి దశలో 250 కోట్ల రూపాయల వ్యయంతో 18.3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.

Post a Comment

 
Top