ఢిల్లీలో మరోసారి సరి-బేసి విధానం |
కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఢిల్లీ లో రెండో విడత సరి-బేసి (Odd - Even) విధానాన్ని ఈ నెల 15వ తేదీ నుండి అమలు చేయనున్నట్లు ఢిల్లీ రవాణాశాఖ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం ప్రకటించారు. ఈ విధానంలో సరి సంఖ్య వాహనాలు ఒక రోజు, బేసి సంఖ్య వాహనాలు తర్వాత రోజు తిరగటానికి అనుమతి ఉంటుంది. ఈ ఆంక్షలు 15 రోజుల పాటు అమలులో ఉంటాయి.
తొలివిడత లో లానే ఇందులో కూడా మహిళలకు, స్కూల్ యూనిఫామ్ ధరించిన విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. జనవరి 1 నుండి 15 వరకు అమలైన తొలివిడత సరి-బేసి విధానం విజయవంతమైన విషయం తెలిసిందే.

Post a Comment