0
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారుగా చాగంటి
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారుగా చాగంటి
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఆధ్యాత్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో జరిగిన ఉగాది వేడుకల్లో ప్రకటించారు. పంచాంగ శ్రవణం తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడుతూ చాగంటి ప్రవచనాలు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని, ప్రజల్ని ముందుకు నడిపిస్తాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి  అమరావతి పేరు పెట్టడం చారిత్రక నిర్ణయమన్నారు.  ఈ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కళారత్న (హంస), ఉగాది పురస్కారాలు కూడా ప్రకటించింది. 

ఏది ఏమయినా, ఇలా తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఆధ్యాత్మిక వేత్తల్ని, వాస్తు నిపుణుల్ని ప్రభుత్వ సలహాదారులుగా నియమించటం విమర్శలకు తావిస్తుంది.

Post a Comment

 
Top