సెప్టెంబర్ లోగా 4000 కోట్లు తీర్చేస్తా

సెప్టెంబర్ లోగా 4000 కోట్లు తీర్చేస్తా
సెప్టెంబర్ లోగా 4000 కోట్లు తీర్చేస్తా
ప్రభుత్వ రంగ బ్యాంకులకు 9000 కోట్లు ఎగవేసి లండన్ లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా, వాటిలో 4000 కోట్లను సెప్టెంబర్‌ 31 లోగా చెల్లిస్తానని తన లాయర్ ద్వారా కోర్టుకు ప్రతిపాదన సమర్పించారు. దీనికి సుప్రీంకోర్టు,  బ్యాంకుల కన్సార్టియాన్ని ఒక వారంలోగా ఈ ప్రతిపాదనకు స్పందించాలని ఆదేశిస్తూ, కేసుని ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.

ఈ 4000 కోట్లు ఎలా చెల్లిస్తామనే విషయాన్నిమాల్యా లాయర్లు సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించారు. బ్యాంకుల కన్సార్టియంలో 17 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. మాల్యా ఇంతకుముందు 2000 కోట్లు చెల్లిస్తానని ప్రతిపాదించగా బ్యాంకులు తిరస్కరించాయి. మాల్య పైన ఎగవేత ఆరోపణలే కాకుండా మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post