పాక్ ప్రజలకు అఫ్రిదీ క్షమాపణలు

పాక్ ప్రజలకు అఫ్రిదీ క్షమాపణలు
పాక్ ప్రజలకు అఫ్రిదీ క్షమాపణలు
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనకు  కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది పాక్ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. తాము అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయామని పేర్కొంటూ ట్విటర్లో వీడియో సందేశం పోస్టు చేశాడు.

నా గురించి ఎవరేమనుకున్నా నేను లెక్క చేయను. కానీ పాకిస్థాన్ ప్రజలకు మాత్రం సమాధానం చెప్పుకోవాలి. ఈ రోజు నన్ను క్షమించమని మిమ్మల్ని అడుగుతున్నాను. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ టీమ్, నేను అంచనాలకు తగినట్టు ఆడలేకపోయాం, క్షమించండి అని వేడుకున్నాడు. అఫ్రిదీ కన్నా ముందే కోచ్ వకార్ యూనిస్ కూడా క్షమాపణలు చెప్పాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB ) అఫ్రిదీ ని కెప్టెన్సీ నుండి తొలగించే అవకాశం ఉంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post