చంద్రబాబు నాపై చేయి చేసుకున్నారు.

చంద్రబాబు నాపై చేయి చేసుకున్నారు.
చంద్రబాబు నాపై చేయి చేసుకున్నారు.
ఇవాళ తెలంగాణ శాసనసభ లో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పై సంచలన ఆరోపణ చేసారు. నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ సందర్భంగా చివరి క్షణంలో మళ్ళీ ఆలోచించాలని కోరినందుకు చంద్రబాబు తనపై చేయి చేసుకున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. తొలిసారి బయటపెడుతున్నా. అప్పుడు షుగర్ మినిస్టర్, నేను పక్కపక్కన కూర్చున్నాం. అది అన్ని యూనిట్లకూ మదర్ యూనిట్ అని, దాని ఆధారంగా పది యూనిట్లు పెట్టారని చెప్పాను. మిగిలిన నష్టాలను దీనిమీద రుద్దొద్దని అడిగాను. అంతే, చంద్రబాబు కోపంతో లేచి ఒక్కసారిగా నా తొడమీద కొట్టారు. ధోతి వేసుకుంటా కదా, అక్కడంతా ఎర్రగా అయ్యింది. నేను లేచి బయటకు వెళ్ళాను. ముఖ్య మంత్రి కదా అని తనకున్న అధికారం తో ప్రైవేటీకరించారు. తర్వాత పిలిచి మరీ సారీ కూడా చెప్పారని వివరించారు. దెబ్బ తగిలిందా అని అడిగారనీ, అక్కడ కాదు హృదయం పైన తగిలిందని చెప్పానని తెలిపారు.

తెలుగు దేశం శాసన సభా పక్ష నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనని, ముఖ్య మంత్రులు కొడతారన్న విషయం తనకు తెలియదనీ, అప్పటి ముఖ్య మంత్రి కొట్టినది ఇప్పుడు బయట పెట్టారనీ, ఇప్పుడు కొట్టింది భవిష్యత్తు లో బయట పెడతారనీ ఎద్దేవా చేసారు.

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు కొట్టినా ఎలా మంత్రి పదవిలో కొనసాగారని ప్రశ్నించగా, దానికి పోచారం స్పందిస్తూ, తెలంగాణకు రూపాయి కూడా ఇచ్చేది లేదన్న కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మీరెలా కొనసాగారని ఎదురు ప్రశ్నించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post