2
నువ్వొచ్చావు
నువ్వొచ్చావు

నిస్పృహతో  నే నిస్తేజమైన వేళ
ఊహల్లోకొచ్చి పలకరించావు


ఎడారిలో ఎండమావికై పరుగుతీసిన వేళ
సెలయేరై సేదతీర్చావు


ఆశయ సాధనలో అలసిన వేళ
ఆపన్న హస్తమై ఆదరించావు


జీవన ప్రయాణం లో ఒంటరినైన వేళ
ఆప్యాయంగా నీ హృదయం లో చోటిచ్చావు


ఎవరూ రాని ఆశల సాధనలో
ఎన్నెన్నో ఊసులతో నా కోసం నువ్వొచ్చావు.

Post a Comment

  1. నిస్పృహతో నే నిస్తేజమైన వేళ
    ఊహల్లోకొచ్చి పలకరించావు chaalaa chaalaa bagundi:):)

    ReplyDelete
  2. @ ఎగిసే అలలు.... garu, Thank you

    ReplyDelete

 
Top