త్రికాలాల్లో సూర్యారాధన

త్రికాల సూర్యారాధన విధి విధానాలు 

ప్రాతః కాలం

బ్రహ్మ ముహూర్తంలో సూర్య దండకాన్ని స్మరిస్తూ నిద్రలేవాలి. స్నానం, సంధ్యావందనం, నిత్యార్చన పూర్తి చేసుకున్న తరువాత సూర్య మంత్రాన్ని ఉపాసన చేయాలి. సూర్య తర్పణం అనంతరం తులసి కోటలో సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి.

అపరాహ్ణ వేళ

అర్చన తరువాత, సూర్య నారాయణ స్వరూపాన్ని గానీ, సాలగ్రామాన్ని గానీ పూజించాలి. మహా నివేదన సమర్పించి, ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి.

సాయం కాలం

నీరెండగా ఉన్న సమయంలోనే సంధ్యావందనం పూర్తి చేసుకుని, సూర్య భగవానుడికి షోడశోపచారాలతో పూజ చెయ్యాలి. నివేదన చేసి, హారతి సమర్పించాలి. సూర్యాష్టకం, దండకం పారాయణ చేయాలి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post