అంతా క్రెడిట్ కోసమే


ఈ సంవత్సరం గోదావరి నదిలో నీళ్లు ఆలస్యంగా చేరడంతో, పట్టిసీమ ద్వారా నీళ్లను ప్రభుత్వం ఆలస్యంగా విడుదల చేసింది. అయితే ఈ ఆలస్యంపై  తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై రకరకాల విమర్శలు చేసింది. కాని, ఒకసారి నీళ్లు విడుదల చేయగానే, ఆ నీటికి మాజీ మంత్రి లోకేష్ గారు హారతి సమర్పించి, పట్టిసీమ నీళ్లు తమవల్లే వస్తున్నాయని ప్రచారం పొందే ప్రయత్నం చేశారు. అంటే నీళ్లు రాకపోతే ప్రభుత్వం తప్పు, వస్తే తమ ఘనత అన్నమాట.

పట్టిసీమ ప్రాజెక్టు తెలుగుదేశం హయాంలోనే పూర్తిచేశారు. కాని, నీళ్లను అందిస్తున్న కాలువలు చాలావరకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి. ఇప్పుడు తమకు క్రెడిట్ దక్కాలనుకునేవాళ్ళు, ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు వైఎస్ గారిని కనీసం గుర్తుచేయలేదు. అయినా పట్టిసీమ అనేది తాత్కాలిక ప్రాజెక్టు, ఒకసారి పోలవరం పూర్తి అయితే, పట్టిసీమ అని చెప్పుకోవడానికి కూడా ఏమీ ఉండదు. ఈ పట్టిసీమ బదులు పోలవరమే పూర్తి చేస్తే 'శాశ్వత క్రెడిట్' దక్కేదిగా. 

రేపు జగన్ గారు కూడా ఇదే పద్ధతిలో పోలవరం అంతా తమ ఘనతే అని అధికారంలో ఉన్నా, లేకపోయినా చెప్పుకుంటారు. ఇక కాలువలను పూర్తి చేసిన రాజశేఖర రెడ్డి గారిది వేరే తరహా. తెలంగాణలో అయినా, ఆంధ్రాలో అయినా ఎక్కడా, ప్రాజెక్టులు కట్టడం ప్రారంభించలేదు కాని, కాలువలను మాత్రం తవ్వేశారు.     

0/Post a Comment/Comments