ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశల వారీ మద్య నిషేధం వైపుగా అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా మద్యం వినియోగాన్ని తగ్గించే దిశగా కొన్ని చర్యలు తీసుకోనుంది. మూడు నెలల అనంతరం రాష్ట్రంలో అమలు కానున్న కొత్త అబ్కారీ విధానంలో ఉన్న నిబంధనలు దీనికి దోహదం చేయనున్నాయి.
కొత్త విధానంలో లైసెన్స్ ఫీజును పెంచడమే కాకుండా, మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూంలను ఎత్తివేయనున్నారు. నగరాలలో మద్యం దుకాణాలలో జరిగే అమ్మకాలలో 30% పర్మిట్ రూంల ద్వారానే జరుగుతుంది. ఈ నిర్ణయాల ప్రభావం పట్టణాలలో తక్కువగా, నగరాలు, మహా నగరాలలో ఎక్కువగా ఉండనుంది. ప్రభుత్వం ధైర్యంగా ఈ రెండు నిర్ణయాలను తీసుకోగలిగితే కొంతమంది దుకాణ దారులు, లైసెన్స్ రెన్యువల్‌కు ముందుకు రారని, దానితో దుకాణాల సంఖ్య కూడా తగ్గుతుందని విశ్లేషణ ఉంది.
పర్మిట్‌రూం అంటే మద్యం దుకాణాల వద్దే తాగడానికి అవకాశం ఉండే గది. వీటివలన దుకాణాల వద్ద భారీ రద్దీ కన్పిస్తోంది. ముఖ్యంగా జనావాస ప్రాంతాల్లో ఎక్కువమంది గుమికూడడం వలన సామాజిక, శాంతిభద్రతల సమస్యలు వస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వీటిని నిషేధించాలని డిమాండ్లున్నాయి. ఈ నేపథ్యంలో పర్మిట్ రూంలు ఎత్తివేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.
Post a Comment