ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఉన్న వారిలో 88% మంది కోటీశ్వరులేనని, వీరికి నేతృత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, అందరిలోకెల్లా సంపన్నుడని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఎడిఆర్) నివేదిక తెలియజేసింది.
ఈ నివేదిక ప్రకారం జగన్ ఆస్థి 510 కోట్ల రూపాయలు. ఆయన తరువాత స్థానంలో పెద్దిరెడ్డి గారు 130 కోట్లతో ఉండగా, మేకపాటి గౌతంరెడ్డి గారు 61 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం యొక్క సగటు ఆస్థి 35.25 కోట్ల రూపాయలుగా పేర్కొంది. ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్న వివరాల ఆధారంగా ఆ సంస్థ, ఈ జాబితాను రూపొందించింది.
సంవత్సర ఆదాయం ప్రకారం కూడా జగన్ గారే మొదటిస్థానంలో ఉన్నారు. ఆయన కుటుంబ ఆదాయం ఏడాదికి 38 కోట్లు. అవంతి శ్రీనివాస్ గారి కుటుంబ ఆదాయం 3కోట్లు కాగా, ఆదిమూలపు సురేష్ గారి కుటుంబ ఆదాయం కోటి రూపాయలుగా ఉంది. ఈ వివరాలను ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన రిటర్నుల నుండి సేకరించారు. ఇక విద్యార్హతలను పరిశీలిస్తే 69% మంది డిగ్రీ, ఆపైన చదువుకున్నారు.
Post a Comment