ఇంతకీ అవి నెహ్రూ జాకెట్లా? మోడీ జాకెట్లా?

దక్షిణ కొరియా అధ్యక్ష్యుడు మూన్-జే-ఇన్ తనకు మోడీ బహుమతిగా ఇచ్చిన జాకెట్‌ను వేసుకున్న ఫోటోను ట్విట్టర్లో ఉంచి "నేను భారత పర్యటనలో ఉన్నప్పుడు మోడీ ధరించిన దుస్తులు బాగున్నాయని వ్యాఖ్యానించాను. దానికి ఆయన కృతజ్ఞతలు తెలిపి నా సైజుకు సరిపడే మోడీ జాకెట్లను బహుమతిగా పంపించారు. ఇవి అద్భుతంగా ఉన్నాయి మరియు దక్షిణ కొరియాలో కూడా ధరించటానికి అనువైనవి."  అని ట్వీట్ చేసారు.

మోడీ బహుమతిగా  పంపిన జాకెట్ల బ్రాండ్ మోడీ అని ఫోటోలలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం వివిధ రకాల విమర్శలు, వాదనలు వినవస్తున్నాయి. అవి ఎప్పటినుండో నెహ్రూ జాకెట్లుగా సుపరిచితమని, వాటిని మోడీ జాకెట్లు అనడం సరికాదని కొందరు అంటుండగా, కాంగ్రెస్ నేత అయిన పటేల్‌ను  తమ ప్రచారం కోసం వాడుకున్నట్లుగానే, వీటిని కూడా మోడీ జాకెట్లుగా మార్చేశారని మరికొందరు అంటున్నారు.  

0/Post a Comment/Comments

Previous Post Next Post