విద్యుత్ కష్టాలలో తెలంగాణ

తెలంగాణలో అన్ని రంగాలకూ ఇప్పుడు 24x7 విద్యుత్ ను అందచేస్తున్నారు. కానీ ఇప్పుడు గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే  డిమాండ్ ఏకంగా  40% వరకూ పెరిగిపోవటంతో పాటు కొన్ని అనుకోని కష్టాలు తోడవటంతో విద్యుత్ ఎక్స్చేంజి ద్వారా యూనిట్ను ఏకంగా పది నుండి పదిహేను రూపాయల వరకు పెట్టి రాష్ట్రం కొనుగోలు చేస్తుంది.  

ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి భారీ స్థిర చార్జీలు చెల్లిస్తూ కొనుగోలు చేసిన 1000 మెగావాట్ల విద్యుత్ అవసరమైన సమయాల్లో ఉపయోగానికి లభించటం లేదు. అక్కడ తీవ్ర బొగ్గు కొరత ఉండటం వల్ల 300 మెగావాట్లు రావటమే గగనంగా మారింది. సెంబ్ కార్ప్ తో కుదుర్చుకున్న పిపిఏ కూడా అదేవిధంగా ఉంది. గత కొంతకాలంగా జనరేటర్ సమస్యల వల్ల అక్కడి 600 మెగావాట్ల విద్యుత్ కూడా లభించటం లేదు. దీనికి తోడు శ్రీకాకుళం ప్రాంతంలో తుఫాన్ సమస్యవల్ల విద్యుత్ లైన్ పని చేయకపోవటం వలన దక్షిణాదికి రావలసిన విద్యుత్ లో 2000 మెగావాట్ల వరకు కోత పడింది. 

ఎన్నికల దృష్ట్యా మార్కెట్లో ఎంత ధరకైనా కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నప్పటికీ, భవిష్యత్తులో ఈ కొనుగోళ్లు వినియోగదారులకు మోయలేని భారంగా మారే అవకాశం ఉంది. ఈ నెల చివరికి కొత్తగూడెంలో నూతనంగా నిర్మించిన 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుండటంతో ఈ కష్టాలు కొంతవరకు తీరనున్నాయి.  

0/Post a Comment/Comments