మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు జరపటానికి మద్రాస్ హైకోర్టు అనుమతి ఇవ్వటంతో డీఎంకే అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కోర్టులో తీవ్ర వాగ్వివాదాల అనంతరం ఈ అనుమతులు లభించాయి.
కోర్టు తీర్పు అనుకూలంగా రావటానికి డీఎంకే నేతలు భారీ కసరత్తే జరిపారు. కోర్టులో మెరీనా బీచ్ లో అంత్యక్రియలు జరపటానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లనన్నింటిని ఉపసంహరింపచేశారు.
ప్రభుత్వ న్యాయవాది మెరీనా బీచ్ లో కేవలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయిన వారికే స్థలాన్ని కేటాయించే సాంప్రదాయం ఉందని వాదించగా, అలాంటి నిబంధన ఏదన్నా ఉందేమో చూపాలని కోరింది. తరువాత పిటిషన్లను అడ్డంకిగా పేర్కొనగా డీఎంకే నేతలు వాటిని ఉపసంహరింపచేసారు. ద్రవిడ నేతల సమాధుల పక్కనే కరుణానిధి అంత్యక్రియలు జరుపాలని లేకపోతే ప్రజల సెంటిమెంట్ దెబ్బతింటుందని డీఎంకే న్యాయవాది వాదించారు.
ఈ పిటిషన్ ను ఇంట తొందరగా విచారణకు స్వీకరించవలసిన అవసరంలేదని ప్రభుత్వ న్యాయవాది అనగా, ఒక వారం తర్వాత విచారిద్దామా? అని న్యాయమూర్తి వెటకారం చేసారు. చివరకు మద్రాస్ హైకోర్టు మెరీనా-అన్నా స్కేర్ వద్దే కరుణానిధి అంత్యక్రియలకు అనుమతినివ్వటం పై డీఎంకే శ్రేణులు ఆనందం వ్యక్తం చేసాయి. స్టాలిన్ అయితే కోర్టులోనే ఉద్వేగంతో ఏడ్చేసారు.
Post a Comment