కేసీఆర్ ను గద్దె దించేవరకు ఎత్తిన బోనం దించం

కేసీఆర్ ను గద్దె దించేవరకు ఎత్తిన బోనం దించం
-కవితమ్మ పాలైన బతుకమ్మ
-కేసీఆర్ గడి కూలగొడతాం
-డాక్టర్ కే లక్ష్మణ్

అప్రజాస్వామిక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించేవరకు ఎత్తిన బోనాన్ని తెలంగాణ మహిళలు దించరని బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో మహిళలు బోనం ఎత్తారు. రాష్ట్రం సాధించారు. ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ హక్కులను హరించారు. ఇప్పుడు కేసీఆర్ ను గద్దె దించే వరకూ మహిళలు ఎత్తిన బోనం దించరని తెలిపారు.  రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం బీజేపీ చేపట్టిన జన చైతన్య యాత్ర మొదటి విడత శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

టీఆర్ ఎస్ పాలన ప్రజా వ్యతిరేకంగా సాగుతోందని విమర్శించారు. మా యాత్రతో టీఆర్ ఎస్ లో ప్రకంపనలు మొదలయ్యయని చెప్పారు. 

మోడీ అస్త్రం ప్రయోగిస్తే టీఆర్ ఎస్ మూర్ఛ పోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రతిరూపం బతుకమ్మను, ముఖ్యమంత్రి కేసీఆర్ తన కూతురు కవితమ్మకు అప్పగించారని వ్యాఖ్యానించారు. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్న కాంగ్రెస్, వారికి ప్రతిరూపమైన అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ కు అన్యాయం చేసిందన్నారు. నాలుగేళ్లుగా వ్యవసాయాన్ని పట్టించుకోని కేసీఆర్, ఎన్నికలొస్తున్నాయని, రైతుబంధు పేరుతో పంట పెట్టుబడి ఇస్తున్నారని విమర్శించారు. మాటలతోనే పాలన చేస్తున్న గారడి ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల కోటలను మోడీ బద్దలు కొట్టారు. ఇప్పుడు టీఆర్ఎస్ గడిని బద్దలు కొడతామని స్పష్టం చేశారు.

రైతుబంధు పథకం పై విమర్శలు గుప్పించారు. నాలుగేళ్ల పాలనలో ఏనాడు రైతులను పట్టించుకోని కేసీఆర్, ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని రైతుబంధు పేరుతో పంట పెట్టుబడి ఇస్తున్నారని విమర్శించారు. అసలైన రైతు ప్రభుత్వం బీజేపీ అని తెలిపారు. పంటకు మద్దతు ధర పెంచి రైతుకు లబ్ది చేకూర్చామని చెప్పారు.

 తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని సశ్యశ్యామలం చేస్తామని ఆయన ప్రకటించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post