జూన్ నెలకు సంబంధించి తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి హుండీల ద్వారా రూ.93.75 కోట్లు ఆదాయం సమకూరింది. జూన్ నెలలో 21,98,253 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.
అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జితసేవా టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో ఉంచింది. వివిధ సేవలకు సంబంధించి మొత్తం 53,642 టికెట్లను టీటీడీ విడుదల చేసింది. లక్కీ డీప్ కోటా కింద 9,742 సేవా టికెట్లు ఉంచారు. సుప్రభాత సేవకు 7596, తోమాల సేవకు 80, అర్చనకు 90, అష్టదళపాదపద్మారాధనకు 240, నిజపాదదర్శనానికి 1,725, టికెట్లు విడుదల చేశారు. జనరల్ కోటా కింద 43,900 సేవా టికెట్లు విడుదల చేశారు. విశేష పూజకు 2000, కల్యాణోత్సవానికి 9,975, ఊంజలసేవకు 3,150, ఆర్జిత బ్రహ్మోత్సవానికి 5,775, వసంతోత్సవానికి 11,000, సహస్రదీపాలంకరణకు 12,000 టికెట్లను టీటీడీ విడుదల చేసింది. జూలై 10, 24 తేదీల్లో వయోవృద్ధులకు ప్రత్యేకంగా 4వేల టోకెన్లు ఉంచారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలు కలిగిన తల్లిదండ్రులకు జూలై 11, 25 తేదీల్లో ప్రత్యేక దర్శనానికి అనుమతి ఇస్తారు.
రాష్ట్ర రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం 20 నుంచి 25 ఎకరాల వరకు స్థలం ఇవ్వనుందని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. అదేవిధంగా 2019 జనవరి నెలఖారు లోపు హైదరాబాద్, కన్యాకుమారిలలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాలను పూర్తి చేస్తామని సింఘాల్ తెలియజేశారు.
Post a Comment