నాగంకు భద్రత పునరుద్ధరించాలి

నాగంకు భద్రత పునరుద్ధరించాలి
ఈ మధ్యే బిజెపి నుండి కాంగ్రెస్ లో చేరిన నాయకుడు నాగం జనార్దన్ రెడ్డికి గతంలో ఉన్న భద్రతను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ,  హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు కల్పిస్తున్న భద్రతను తొలగించడంతో ఆయన హై కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, ఎందుకు భద్రత తొలగించవలసి వచ్చిందో వివరాలు తెలియజేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ఆదేశించింది.  తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. 

0/Post a Comment/Comments