పార్లమెంటు మరియు అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనేది తమకు అంగీకారమేనని, కానీ ఐదు సంవత్సరాలు పదవీకాలం పూర్తి కాకముందే, ముందస్తు ఎన్నికలు అవసరం లేదని తెలుగు దేశం పార్టీ ఆదివారం లా కమిషన్ కు తెలియజేయనుంది.
టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కాకినాడ ఎంపీ తోటా నరసింహం మాట్లాడుతూ ఎన్నికలు 2019 ఏప్రిల్-మే నెలలో ఎన్నికలు జరగాలని, తాము గడువుకు ముందే ఎన్నికలను వ్యతిరేకిస్తామని తెలిపారు. ఇవాళ లా కమిషన్ టిడిపికి తన అభిప్రాయాలను తెలపటానికి సమయం కేటాయించింది.
తెలుగు దేశం పార్టీ తాము, వోటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (VVPAT) వ్యవస్థతో కూడిన ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల కోసం ఒత్తిడిని తెస్తాము. లేకపోతే, అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికీ అమల్లోఉన్న పేపర్ బ్యాలట్ వ్యవస్థను కొనసాగించాలని కోరుతాం అని తెలిపింది.
మేము సిద్ధమే - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
తాము జమిలి మరియు ముందస్తు ఎన్నికలు రెండింటికీ సంసిద్ధంగా ఉన్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహా కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు అన్నారు. కానీ ఇవి వాస్తవ రూపం దాల్చటం పై సందేహాలు వ్యక్తం చేసారు.
మేము ముందస్తుకు సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వల్ల ప్రజలకు నష్టం జరిగింది. ఇంకా వేచి ఉండటం వల్ల నష్టం మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.
Post a Comment