రెజీనాకు పోలీసుల వార్నింగ్

రెజీనాకు పోలీసుల వార్నింగ్
ఈ మధ్య వరుసగా చాలా ఛాలెంజ్‌లు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ రెజీనా కూడా కికి ఛాలెంజ్‌ ను స్వీకరించి, ఆ వీడియోను షేర్ చేసింది. ఇందులో రెజీనా సాంప్రదాయ దుస్తులలో చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది.

హాలివుడ్ నటుడు షిగ్గి కికి ఛాలెంజ్‌ ను ప్రారంభించారు. దీనిలో భాగంగా నిదానంగా కదులుతున్న కారు నుండి కిందకి దిగి కారు తో  పాటు నడుస్తూ డ్యాన్స్ చేసి మళ్లీ కారులోకి రావాలి.

దీనిపై కొంతమంది సెలెబ్రిటీలు ప్రశంసలు కురిపించగా, ముంబై మరియు కర్ణాటక పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసారు. సెలెబ్రిటీలు బాధ్యతతో మెలగాలనీ, వారిని ఎక్కువ మంది అనుసరించే ప్రమాదముందనీ,  ఇటువంటి ఛాలెంజ్ ల వల్ల వారికే కాకుండా, రోడ్డు పైన ప్రయాణిస్తున్న ఇతరులకు కూడా ప్రమాదమని హెచ్చరించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post