పవన్ ఎన్నికలంటేనే భయపడి పారిపోయాడు

పవన్ ఎన్నికలంటేనే భయపడి పారిపోయాడు
చంద్రబాబును ఎదుర్కొనే ధైర్యం లేక జగన్‌ అసెంబ్లీ నుంచి పారిపోయారని, ఆయన స్థానంలో తానుంటే ఒక ఊపు ఊపేవాడినని పవన్ ఇవాళ భీమవరం బహిరంగ సభలో అన్నారు. 

ఈ మాట పవన్  అనటం విచిత్రమే. పవన్ కూడా ఈ విషయంలో చంద్రబాబు వైఖరినే అనుసరిస్తున్నారు. చంద్రబాబు నాలుగేళ్లు బిజెపితో ఉండి, ఇప్పుడు విమర్శించినట్టుగా, పవన్ కూడా దాదాపు నాలుగేళ్లు చంద్రబాబు కు మద్ధతిచ్చి ఇప్పుడు బయటకు వచ్చాడు. చంద్రబాబు కు ఓటు వేయమని చెప్పిన పవన్, చంద్రబాబు  వైఫల్యాలకు బాధ్యత వహించడా? పోనీ ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులకు అధికార పార్టీని వదిలేసి ప్రతిపక్షాన్ని విమర్శించటమేంటో ?  

జగన్ స్థానంలో నేనుంటే అంటే ఆ స్థానం ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే వచ్చింది. నీ లోపాయికారీ మద్దతు వల్ల రాలేదు. నీలాగా ఎన్నికల్లోంచి పారిపోయి మళ్ళీ నాలుగేళ్లకు ప్రజల ముందుకు రాలేదు. కెసిఆర్ గత ఎలక్షన్లలో చెప్పాడు కదా నీ గురించి 'ఎన్నికలనగానే సినిమాల్లో మొఖానికి రంగులేసుకునే వాళ్లంతా వచ్చి ఇక్కడ వేషాలేస్తారని'. తమరు గత మూడు దఫాలుగా ఎన్నికలప్పుడే ప్రజల ముందుకు వస్తున్నారు మరి. 

0/Post a Comment/Comments