30 కన్నా ఎక్కువ పథకాలకు వారి కుటుంబం పేరే

sandeep pandey
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 కంటే ఎక్కువ సంక్షేమ పథకాలకు, ప్రభుత్వం చంద్రన్న మరియు అన్నాపేర్లతో తమ సొంత కుటుంబ ప్రచారం చేసుకుంటోందని రామన్ మెగసెసే అవార్డు విజేత సందీప్ పాండే, నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్ మెంట్ సభ్యుడు బి.రామకృష్ణం రాజులు విమర్శించారు. ఇది 2015-16 లో సుప్రీం కోర్టు రూపొందించిన మార్గదర్శకాలను నిర్లక్ష్యం చేయడమేనని వారు అన్నారు. 

విగ్రహాలు పెట్టడం కానీ, పథకాలకు పేర్లు గానీ కేవలం చనిపోయిన నాయకులవే ఉంటాయి కానీ ఆంధ్ర ప్రదేశ్లో పరిస్థితి భిన్నంగా ఉందని వారు ఆశ్చర్యం వ్యక్తం చేసారు. పేర్లే పెట్టాలనుకుంటే స్వాతంత్య్ర సమార యోధుల పేర్లుగానీ, సాంస్కృతిక సంబంధమైన పేర్లు గానీ పెట్టాలని సూచించారు. 

కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రధాన మంత్రి యోజన అన్నట్లుగానే ముఖ్యమంత్రి పేరుతో ఉంటే, ప్రభుత్వం మారినప్పుడల్లా పథకం పేరు మార్చాల్సిన అవసరం ఉండదని, ప్రజాధనం వృధా కాదనీ వారు తెలిపారు. ఇంకా ప్రభుత్వ ఖర్చుతో భారీ స్థాయిలో చంద్రబాబు, లోకేష్ ల ప్రచారం చేపట్టటం, హోర్డింగులు పెట్టడాన్ని కూడా వారు తప్పుపట్టారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post