పార్లమెంట్లో ప్రత్యేక హోదా కావాలని వివిధ రాష్ట్రాల నుండి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇలా పార్లమెంట్లో బీహార్, ఒడిషా, తెలంగాణ రాష్ట్రాలు డిమాండ్ చేసాయి.
ఆంధ్రప్రదేశ్ కు హామీ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలనీ, కానీ ఆ రాష్ట్రంతో పాటు తమకు కూడా ప్రత్యేక హోదా కల్పించాలని బీహార్ ఎమ్పీ రామచంద్ర ప్రసాద్ సింగ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం లక్షా పదకొండువేల రూపాయలు ఉండగా, తమ రాష్ట్రంలో అది కేవలం ముప్పై ఎనిమిది వేల రూపాయలు మాత్రమేనని ఆయన అన్నారు. తమ రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, కనీసం ప్రత్యేక హోదాతోనైనా అవి బాగుపడతాయని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, కాని అబివృద్ధి లో ఆ రాష్ట్రం కంటే ఎంతో వెనుకబడిన ఒడిషాకు కూడా ఇవ్వాలని ఎంపీ ప్రసన్న కుమార్ అన్నారు. తాము బిజూ పట్నాయక్ కాలం నుండి ఈ డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. కేంద్రం ఫెడరలిజం పై దాడి చేస్తోందని, రాష్ట్రాల హక్కులను హరించి వేస్తుందని ఆయన అన్నారు.
Post a Comment