నవాజ్ షరీఫ్ కు పదేళ్ల జైలు

నవాజ్ షరీఫ్ కు పదేళ్ల జైలు
ఇస్లామాబాద్ లోని అవినీతి వ్యతిరేక కోర్టు పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కు ఎనిమిది మిలియన్ పౌండ్ల జరిమానా మరియు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అతని కుమార్తె మరియం నవాజ్ కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష మరియు రెండు మిలియన్ పౌండ్ల జరిమానా, మరియు అతని అల్లుడు రిటైర్డ్ కెప్టెన్ సఫ్దార్ ఒక సంవత్సరం జైలు శిక్షను పొందారు. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు షరీఫ్ తరపు న్యాయవాదులు తెలిపారు. 

షరీఫ్ భార్య కుల్సుమ్ నవాజ్ లండన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో, ఇదే కారణం పై తీర్పును వాయిదా వేయించడానికి షరీఫ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. షరీఫ్ ఇంకా లండన్ లోనే ఉన్నారు. తన భార్య ఆరోగ్యం మెరుగు పడిన తర్వాత తిరిగి వస్తానని కోర్టులో ప్రమాణం దాఖలు చేసారు. 

పనామా పత్రాల ఆధారంగా ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ , నవాజ్ షరీఫ్ కుటుంబం నెస్కోల్ మరియు నెల్సన్ అనే బినామీ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ జరిపిందని, లండన్ లో 200 మిలియన్ పౌండ్ల విలువైన ఆస్తులున్నాయని కేసు దాఖలు చేయటంతో కోర్టు నవాజ్ షరీఫ్ ను 2017 జులైలో ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటించింది. షరీఫ్ కుమారుడు హుస్సేన్ నవాజ్ ఫ్లాట్లు ఉన్నాయని ఒప్పుకున్నాడు కానీ అవినీతి డబ్బు ద్వారా కొనుగోలు చేయలేదని తెలిపాడు. నవాజ్ పార్టీ అధ్యక్ష్య పదవిని, ఎన్నికలలో పోటీ చేస్తే అర్హతని కూడా కోల్పోయాడు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post