అప్పుడు సమర్థించి... ఇప్పుడు మాట మారుస్తారా?

అప్పడు సమర్థించి... ఇప్పుడు మాట మారుస్తారా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్ష్యుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉన్నందున, కాపులను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చడంపై హామీ ఇవ్వలేను అని స్పష్టం చేసారు. దీనిపై ఆదివారం వారం రోజు కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేసారు. 

కాపులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రస్తుతం కాపుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ ఈ అంశంపై వైఖరి మార్చాడని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు కూడా రాష్ట్ర పరిధిలోవి కావని, వాటిపై జగన్ ఎందుకు మాట్లాడుతున్నారని, హామీలు ఇస్తున్నారని ముద్రగడ అడిగారు. తుని బహిరంగ సభ సమయంలో మరియు అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ ను సమర్థించి ఇప్పుడు మాటమార్చడం పద్దతి కాదని ఆయన అన్నారు. 

జగన్ సాధ్యం కానీ హామీలు ఇవ్వడం లేదా? ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన హామీలకు రాష్ట్ర, కేంద్ర బడ్జెట్లే కాదు, అమెరికా బడ్జెట్ కూడా సరిపోదని ముద్రగడ ఎద్దేవా చేసారు. 

గోనాన గ్రామంలో పాదయాత్ర సందర్భంగా  జగన్ యు-టర్న్ తీసుకున్నందుకు కాపు యువకులు, ప్ల కార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేసారు. మోసం చేసాడని నినాదాలు చేసారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post