తెలంగాణాలో ఉచిత కంటి పరీక్షలు

తెలంగాణాలో ప్రతి పౌరుడికీ  ఉచితంగా కంటి పరీక్షలను చేయించడానికి  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఆగస్టు 15 నుండి  ప్రారంభమవనుంది. ఈ పథంలో భాగంగా రాష్ట్రంలోని 3.7 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయనున్నారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి ఉచిత కళ్లద్దాలు, మందులు ఇస్తారు. శస్త్ర చికిత్స అవసరమైన వారిని కూడా ఆసుపత్రిలో చేర్పించి ఉచిత శస్త్ర చికిత్స చేయనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. 

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గారు, ఈ పథకాన్ని స్వయంగా ఆయనక ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రారంభించనున్నారు. గవర్నర్ ఇ. ఎస్. నరసింహన్ కూడా ఈ పథకం పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తూ తాను కూడా ఒక దగ్గర కంటి పరీక్షలు చేయించుకొని ఆ ప్రాంతానికి ప్రారంభిస్తానని తెలిపి, అందరూ ఉత్సాహంగా పాల్గొన వలసిందిగా విజ్ఞప్తి చేసారు. ముఖ్యమంత్రి ఈ పథకం ప్రారంభం విషయమై ఏర్పాటు చేసిన అధికారిక సమావేశంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేసారు. 

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్లు స్థానిక నాయకులతో సమావేశమై షెడ్యూలును రూపొందించవలసిందిగా సూచించారు. మొత్తం 799 కంటి పరీక్ష బృందాలను ఇందుకోసం నియమించారు. ఈ బృందంలో ఆప్టోమెట్రిస్ట్, MBBS డాక్టర్,  టెక్నీషియన్, నర్సులు మరియు ఇతర సహాయక సిబ్బంది ఉంటారు. శస్త్ర చికిత్సల కోసం 114 కంటి ఆసుపత్రులు గుర్తించబడ్డాయి. వర్షం సందర్భంగా కూడా నిరంతరాయంగా పరీక్షలు నిర్వహించడానికి స్థానికంగా స్కూల్ మరియు ఇతర భవనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post