శాసన సభలో సీట్లు పెరగవని తెలిసిన తర్వాతే బిజెపి, టిడిపిల మధ్య దూరం పెరిగిందని ఎపి ప్రభుత్వ రిటైర్డ్ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. గుంటూరులో జరిగిన మేధావుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ తెలుగు దేశం ప్రభుత్వాన్ని విమర్శించారు. విభజన హామీల పై న్యాయపోరాటం చేస్తామన్న క్యాబినెట్ నిర్ణయం కూడా సరియైనది కాదని, కోర్టులు ప్రత్యేక హోదా ఇవ్వవని, ఇది కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన అన్నారు.
కేంద్రంలోని అధికారులు, ఇక్కడి వారికంటే ఎక్కువ తెలివి గల వారని, వారికి ఏ తప్పుడు లెక్కలు చూపించినా ఇట్టే పట్టేస్తారని, ఎపి సర్కారు ఆటలు అక్కడ సాగవని, కోర్టులో కూడా కష్టమేనని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. నాలుగేళ్లు అధికారంలో ఉండి ప్రత్యేక హోదాను పట్టించుకోలేదని అన్నారు. తెలుగు దేశం సర్కారుకు చిత్తశుద్ది ఉంటే ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా హోదాను సాధించాలని, లేదంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సూచించారు.
Post a Comment