లోయలో పడిన బస్సు - 48 మంది మృతి

లోయలో పడిన బస్సు - 48 మంది మృతి
ఆదివారం ఉత్తరాఖండ్‌లోని  పౌరిగల్వార్‌ జిల్లా నైనిదండ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి 200 మీటర్ల లోతున్న లోయలో పడింది. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం ఈ దుర్ఘటనలో డ్రైవర్‌తో సహా 48 మంది మృతిచెందారు. మరో 8 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 45 మంది అక్కడికక్కడే మృతి చెందగా,  ముగ్గురు ఆసుపత్రిలో మరణించారు. 

ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, పోలీసులు సహాయక బృందాలతో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద కారణం ఇంకా తెలియ రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం మరణించిన వారికి 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేలు నష్టపరిహారం ప్రకటించింది. ప్రధానమంత్రి ఈ విషయమై సంతాపం తెలుపుతూ ట్వీట్ చేసారు. 


0/Post a Comment/Comments

Previous Post Next Post