ఆంధ్రప్రదేశ్ నుండి 7000 మంది విక్రయదారులు

ఆంధ్రప్రదేశ్ నుండి 7000 మంది విక్రయదారులు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి 7000 కు పైగా వ్యక్తులు / సంస్థలు విక్రయదారులుగా అమెజాన్ లో నమోదై ఉన్నారని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, అఖిల్ సక్సేనా అన్నారు. ఈ రాష్ట్రము తమ వ్యాపార విస్తరణకు చాలా ముఖ్యమని, ఇక్కడ అధిక వృద్ధి అవకాశాలు ఉన్నాయని ఆయన తెలియచేసారు. 

అమెజాన్ సంస్థ గురువారం విజయవాడలో తమ తొలి కస్టమర్ ఫుల్ ఫిల్లింగ్ పాయింట్ (fulfilling point -warehouse) ని ప్రారంభించింది. దీని వల్ల డెలివరీ సమయం ఆదా అవుతుందని, అమ్మకందారులకూ, మరియు కొనుగోలు దారులకూ ఖర్చు తగ్గి మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. 

దేశంలో తమ సంస్థ ఈ సంవత్సరంలో ఇటువంటి గిడ్డంగులు 50 నెలకొల్పాలని భావిస్తోందని, ఇవి 20 మిలియన్ చదరపు అడుగుల స్థలం లో ఏర్పాటు చేయనున్నామని తెలియజేసారు.  ఒక్క విజయవాడ నుండే 1400 మంది విక్రయదారులు ఉన్నారని, వారిలో ఎక్కువ మంది కళాకారులు, దుస్తులు, బొమ్మలు మరియు ప్లాస్టిక్ పాత్రలను అమ్మేవారని తెలిపారు. 

0/Post a Comment/Comments