జపాన్ లోని టోరే ఇండస్ట్రీస్ యొక్క భారతీయ అనుబంధ సంస్థ అయిన టోరే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో కొత్త ప్రొడక్షన్ యూనిట్ కు శంకుస్థాపన చేసింది. ఈ యూనిట్ ను 85 ఎకరాల్లో 1000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఇది టోరే ఇండియాకు మనదేశంలో రెండవ ఉత్పత్తి కేంద్రం కాగా శ్రీసిటీ లో 20వ జపనీస్ కంపెనీ.
టోరే ఇండియా ఇక్కడ ఆటోమోటివ్, విద్యుత్ మరియు FMCG ఉత్పత్తులతో పాటు, ప్రోక్టర్ & గాంబుల్, మరియు కిమ్బెర్లీ క్లార్క్ వంటి డైపర్-మేకర్స్ కు అవసరమైన పాలీ ప్రొపిలీన్ స్పిన్ బాండ్ ను ఉత్పత్తి చేయనుంది. దీనిద్వారా 130 ప్రత్యక్ష మరియు 520 పరోక్ష ఉద్యోగాలు రానున్నాయి మరియు తర్వాత దశల్లో ఇవి పెరగనున్నాయని టోరే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అకిహిరో నిక్కకు తెలియచేసారు.
Post a Comment