ఈ వాటర్ బాటిల్ ఖరీదెంతో తెలుసా?

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ
మనకు దాహం వేస్తే వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతాం. మహా అయితే దాని ధర 20 నుండి 30 రూపాయల వరకు ఉంటుంది. మన దగ్గర సూపర్ మార్కెట్లలో దొరికే కొన్ని ఒక లీటర్ వాటర్ బాటిళ్లు 100 రూపాయల వరకు ఉంటాయి. మన దేశంలో కొంతమంది ధనవంతులు, స్పోర్ట్స్ స్టార్స్ దిగుమతి చేసుకొని మరీ ఖరీదైన వాటర్ బాటిళ్లనే ఉపయోగిస్తారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ  కేవలం ఏవియాన్ అనే కంపెనీ తయారు చేసిన బాటిల్ ని మాత్రమే తాగుతాడు. దీని  ఖరీదు దాదాపు 600 రూపాయలు.  విరాట్ కోహ్లీ కేవలం నీటికే రోజుకి కొన్ని వేల రూపాయలు ఖర్చు చేస్తాడట. 

ప్రపంచం లో  వీటిని మించిన కొన్ని అత్యంత ఖరీదైన వాటర్ బాటిళ్లు ఉన్నాయి. వాటి  గురించి.... 

ఆక్వా-డి-క్రిస్టలో (750ml) - ధర $60000 - (దాదాపు 40 లక్షల రూపాయలు)
ఆక్వా-డి-క్రిస్టలో
ఆక్వా-డి-క్రిస్టలో
ఇది ప్రపంచం లోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్. దీన్ని తాగాలంటే మనం ఆస్తులమ్ముకోవాల్సిందే. దీని కోసం నీటిని ఫ్రాన్స్, ఫిజి లోని పర్వత ప్రాంతాల నుండి సేకరిస్తారు. ఈ బాటిల్ 24 క్యారెట్ల మేలిమి బంగారం తో తయారు చేయబడి ఉంటుంది. నీటిలో కూడా ఐదు మిల్లీగ్రాముల బంగారం కలపబడి ఉంటుందట. దీనిని రోజూ తాగే వారెవరు ఉండరట. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో  మాత్రమే కొంతమంది దీనిని ఉపయోగిస్తారట. బాటిల్ కూడా స్టైల్ గా, నాలుగవ హెన్రీ కాలం నాటి చారిత్రకమైన డిజైన్ తో ఉంటుంది. 

కోనా నిగరి  (750ml ) -  ధర $402 - (దాదాపు 40 వేల రూపాయలు)
కోనా నిగరి
కోనా నిగరి 
కోనా నగరి నీటిలో ఆయుర్వేద విలువలుంటాయనీ, వీటిని తాగితే ఆరోగ్యం బాగు పడుతుందనీ మరియు చర్మం నిగారింపును సంతరించుకుంటుదనీ భావిస్తారు. ఈ నీటిని తాగటం ద్వారా మానసిక ఒత్తిడి దూరమవుతుందని తయారీదారుల ప్రకటనల్లో చెబుతున్నారు. హవాయి దగ్గరలోని పసిఫిక్ మహా సముద్రంలో  రెండు వేల అడుగుల లోతు నుంచి స్వచ్ఛమైన, ఖనిజ లవణాలున్న నీటిని సేకరించి, వాటిలో ఉండే ఉప్పదనాన్ని పోగొట్టి, బాటిళ్లలో నింపుతారు.ఈ  నీటిని జపాన్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ నీటిని అక్కడ రోజూ తాగేవాళ్ళు కూడా ఉన్నారట. జపనీయులు రోజుకు 80వేలకు పైగా ఈ బ్రాండ్ వాటర్ బాటిళ్లను దిగుమతి చేసుకుంటారు. 

ఫెలికో   (750ml ) -  ధర $219 - (దాదాపు 15 వేల రూపాయలు)
ఫెలికో
ఫెలికో 
చెస్ లో ఉండే రాజు, రాణులను తలపించే ఈ బ్రాండ్ వాటర్ బాటిళ్లు జపాన్ లోని ఒసాకా లో తయారవుతాయి. వీటి మూతలు బంగారు రంగులో ఉండి రాజసాన్ని ఒలికిస్తాయి. వీటిని తాగటం వల్ల సౌందర్యం మెరుగుపడుతుందని భావిస్తారు. 

బ్లింగ్ హెచ్‌టూవో (750ml ) -  ధర $40 - (దాదాపు 2700 రూపాయలు)
బ్లింగ్ హెచ్‌టూవో
బ్లింగ్ హెచ్‌టూవో
బ్లింగ్ హెచ్‌టూవో బాటిల్ కూడా ప్రత్యేకమైన డిజైన్ తో ఉంటుంది. స్వరోవ్ స్కీ క్రిస్టల్ తో తయారైన ఈ బాటిళ్లు ఆకర్షణీయంగా ఉంటాయి. టెనెస్సీ దగ్గరున్న నీటి బుడగల నుంచి సేకరించిన జలాన్ని శుద్ధి చేసి వీటిలో నింపుతారు.    

వీన్ (750ml ) -  ధర $23 - (దాదాపు 1500 రూపాయలు)
వీన్
వీన్
ఫిన్లాండ్‌కు చెందిన వీన్ కంపెనీ కూడా అత్యధిక ధర కలిగిన వాటర్ బాటిళ్లను విక్రయిస్తోంది. కాలుష్యం లేకుండా పచ్చదనం, స్వచ్ఛమైన వాతావరణం ఉన్న వివిధ ప్రాంతాల్లోని నీటి బుడగల నుంచి నీళ్లను సేకరించి, బాటిళ్లలో నింపుతుంది. ముఖ్యంగా ప్రపంచంలోనే ప్రకృతి సంపద అధికంగా ఉన్న భూటాన్‌లోని హిమాలయ ప్రాంతం నుంచీ, లాప్‌లాండ్‌లోని ప్రత్యేక ప్రదేశాల నుంచీ నీటిని సేకరించి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది. 

10 థౌజండ్ బీసీ (750ml ) -  ధర $14 - (దాదాపు 1000 రూపాయలు)
10 థౌజండ్ బీసీ
10 థౌజండ్ బీసీ 
కెనడాలోని వాంకోవర్ నగరానికి 200 మైళ్ల దూరంలో ఉండే పర్వతప్రాంతాల్లో ఆరు వేల అడుగుల లోతు న ఉండే హిమానీనదాలను కరిగించి ఈ కంపెనీ నీటిని సేకరిస్తోంది. ఈ ప్రాంతానికి మనుషులు, జంతువులు వెళ్లలేవు. కాబట్టి ఇక్కడి నీరు కలుషితమయ్యే అవకాశం ఉండదు. హిమానీనదాల నుంచి వచ్చే నీరు కావడంతో దీనిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని కంపెనీ చెబుతోంది. ఈ నీటిని తాగటం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుందనీ, చర్మం మీద ముడతలు రావనీ అంటున్నది. 

ఇవే కాకుండా ఖరీదయిన వాటర్ బాటిళ్లలో ఆక్వా డెకో, లాక్వెన్ ఆర్టీస్, టాస్మానియాన్ రైన్ మరియు ఫైన్ లాంటి బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post