టీఎస్‌ఆర్టీసీకి 600కోట్ల నష్టం |
2015-16 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకే టీఎస్‌ఆర్టీసీకి 600 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఆర్టీసీ జేఎండీ రమణారావు అన్నారు. సిబ్బందికి జీతాలు పెంచటం వల్ల సంస్థపై ఆర్థిక భారం పెరిగి నష్టాలు వచ్చాయని ఆయన తెలిపారు. నిర్వహణ వ్యయం తగ్గింపు, అంతర్గత సమర్థత పెంచి నష్టాలు అదుపులో ఉంచామని చెప్పారు.
త్వరలో దూరప్రాంతాలకు 150 కొత్త బస్సులు ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. మే 15 వ తేదీ నాటికి 10 ఏసీ లగ్జరీ బస్సులు కూడా ప్రవేశపెడతామని ఆయన వెల్లడించారు. ఆర్టీసీ నష్టాలు తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నామని తెలిపారు. లాభదాయకమైతే తాము సరకు రవాణా ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచే ప్రతిపాదన ఏదీ లేదని కూడా తెలిపారు.
Post a Comment