రాఫాలే ఒప్పందం సుఖాంతం

 రాఫాలే ఒప్పందం సుఖాంతం
 రాఫాలే ఒప్పందం సుఖాంతం
ఎట్టకేలకి భారత్ - ఫ్రాన్స్ మధ్య రాఫాలే యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం ఓ కొలిక్కి వచ్చింది. గతేడాది ఏప్రిల్ లో భారత ప్రధాని మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు హోల్లాండేని కలిసినప్పుడు 36 విమానాలను కొనుగోలు చేయటానికి ప్రాథమిక అవగాహన కుదుర్చుకున్నారు. తర్వాత చర్చల దశలో సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, ధరలపై అవగాహనకు రాకపోవటం తో ప్రతిష్టంభన ఏర్పడింది.

అయితే, రక్షణ శాఖ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఈ ఒప్పందం ఇప్పుడు కొలిక్కి వచ్చింది.  అయితే, దాదాపు 7.8 మిలియన్ యూరోలు (మన కరెన్సీలో దాదాపు 59000 కోట్ల రూపాయలు) వెచ్చించి 36 రాఫాలే యుద్ధ విమానాలను  కొనుగోలు చేయనుంది. ఈ యుద్ధవిమానాల తో పాటు పైలట్ ట్రైనింగ్, కొన్ని సంవత్సరాల నిర్వహణ, వాటికి అవసరమైన క్షిపణులు, బాంబులు, కూడా ఈ ఒప్పందం లో భాగమే. పైలట్ ట్రైనింగ్, విమానాల నిర్వహణకు ఒక రన్ వే ను కూడా మన దేశం లో నిర్మించనుంది.  ఫ్రాన్స్ మొదట 11 మిలియన్ యూరోలతో ప్రారంభించి చివరకు 7.8 మిలియన్ యూరోలకు దిగి వచ్చింది. అయితే మన దేశానికి ఈ యుద్ధ విమానాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ ఉండదు. మొదట మన దేశం AESA రాడార్, జెట్ ఇంజిన్ పరిజ్ఞానాలపై పట్టుబట్టినప్పటికీ తర్వాత ఆశలు వదిలేసుకుంది. తాజాగా స్వీడన్ కు చెందిన సాబ్ కంపెనీ తో LCA తేజస్ ను అభివృద్ధి పరచటానికి సాంకేతిక సహకారం కోసం చర్చలు ప్రారంభించింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post