100 కోట్లకి ఆధార్

100 కోట్లకి ఆధార్
100 కోట్లకి ఆధార్
ఆధార్ సంఖ్యను ఉపయోగించటానికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంట్లో తీర్మానం జరిపాక మరో మైలురాయి ని అందుకుంది. ఇవాల్టికి  దేశవ్యాప్తంగా ఆధార్‌ కార్డు పొందిన వారి సంఖ్య 100 కోట్లకి చేరుకుంది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ న్యూడిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

2010 లో ఆధార్‌ నెంబర్ ను జారీ చేయటం మొదలుపెట్టామని, ఇప్పటివరకు 97శాతం ప్రజలకు ఆధార్‌ అందించగాలిగామని తెలిపారు. ఆధార్‌ డేటా ఆధారంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను రూపొందించనుంది. ఇప్పటికీ రోజుకు రోజుకి 5 నుండి 7లక్షల మందికి ఆధార్‌ సంఖ్యను అందిస్తున్నామని, ఇది ప్రపంచలోనే అతి పెద్ద డిజిటల్‌ ఐడెంటిఫికేషన్ ప్రాజెక్ట్  అని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటివరకు 25.48 కోట్ల బ్యాంకు ఎకౌంటులు, 71% గ్యాస్‌ కనెక్షన్లు, 45% రేషన్‌ కార్డులకు ఆధార్‌ అనుసంధానించారు. ప్రతీ రోజు 40 లక్షల లావాదేవీలు ఆధార్ సంఖ్య తో జరుగుతున్నాయని యూఐడీఏఐ (Unique Identification Authority of India) తెలిపింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post