అసోం, బెంగాల్ లలో భారీ పోలింగ్ |
డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ సందీప్ సక్సేనా మీడియా కు వెల్లడించిన వివరాల ప్రకారం రెండవ దశలో జరిగిన ఎన్నికలలో అసోం లో 82% పోలింగ్ నమోదైంది. 61 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలలో 2014 లోక్ సభ ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్ నమోదైంది. 2011 అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ 76% పోలింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీపడగా, 143 EVMలు సాంకేతిక కారణాల వల్ల మార్చవలసి వచ్చింది. ఈ ఎన్నికలలో 148 మోడల్ పోలింగ్ బూత్ లు, 73 మహిళా బూత్ లు ఏర్పాటు చేసారు. బార్పేట లో జరిగిన గొడవల్లో ఒక వ్యక్తి చనిపోగా, న్యాయ విచారణకు ఆదేశించామని తెలిపారు. మిగతా ప్రాంతాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి.
పశ్చిమ బెంగాల్ లో జరిగిన మొదటి దశలో దాదాపు 80% పోలింగ్ జరిగింది. ఇక్కడ 31 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరిగాయి. 2011 లో ఇక్కడ రికార్డు స్థాయిలో 83.72% పోలింగ్ జరిగింది. అక్కడక్కడా చిన్న చిన్న సంఘటనలు, రాజకీయ పార్టీల మధ్య గొడవలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి.
Post a Comment