స్వదేశీ GPS సిస్టమ్ దిశగా భారత్

స్వదేశీ GPS సిస్టమ్ దిశగా భారత్
స్వదేశీ GPS సిస్టమ్ దిశగా భారత్
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) స్వదేశీ GPS సిస్టమ్ దిశగా  మరో ముందడుగు వేసింది. ఏడు ఉపగ్రహాల ఈ వ్యవస్థ లో భాగమైన ఆరవ ఉపగ్రహం IRNSS-1F ను ఇవాళ దిగ్విజయం గా కక్ష్య లో  ప్రవేశపెట్టగలిగారు. ISRO తన అత్యంత విశ్వసనీయమైన PSLV  సిరీస్ లో భాగమైన C - 32 రాకెట్ ద్వారా ఈ ఘనత సాధించింది.

1400 కోట్ల ఖర్చు తో ఏర్పడనున్న ఏడు ఉపగ్రహాల ఈ వ్యవస్థ భారత దేశం తో పాటు సరిహద్దుల అవతల 1500 కిలో మీటర్ల మేర తన సేవలు అందించనుంది. వ్యవస్థ లో చివరిదైన ఏడవ ఉపగ్రహమైన  IRNSS-1G  ని మార్చ్ / ఏప్రిల్ చివరి లో ప్రయోగించనున్నారు.

యాభైనాలుగున్నర గంటల కౌంట్ డౌన్  తర్వాత, అంతరిక్ష శకలాలను తప్పించేందుకు ఒక నిమిషం ఆలస్యంగా PSLV C - 32 రాకెట్ ప్రయోగం జరిపారు.  20. 13 నిమిషాల తర్వాత ఈ రాకెట్ 44.4 మీటర్ల పొడవైన 1425 కిలోల ఉపగ్రహాన్ని భూమధ్యరేఖకు 17.86 డిగ్రీల వాలులో తాత్కాలిక సబ్-జియో సింక్రోనస్ కక్ష్యలో ప్రవేశపెట్టింది.  ఈ ఉపగ్రహ జీవిత కాలం 12 సంవత్సరాలు.

PSLV  సిరీస్ లో ISRO కు ఇది వరుసగా 33వ విజయం. కాగా ఈ ఏడాది మరో 25 విదేశీ ఉపగ్రహాలను కూడా తన వాణిజ్య ప్రయోజనాల నిమిత్తం కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post