|
సిడ్నీ ఫైనల్లో సానియా హింగిస్ జంట |
ఇండియా టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, స్విస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ జతగా సిడ్నీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఫైనల్లోకి 29 వరుస విజయాల ప్రపంచ రికార్డు తో అడుగుపెట్టింది. ఈ ప్రపంచ నెంబర్ వన్ జంట సెమీఫైనల్లో రాలుక ఒలారు (రుమేనియా) / యురోస్లావ స్వెదోవ (కజకిస్తాన్ ) జంటపై 4-6, 6-3, 10-8 తో గెలుపొందింది. హోరాహోరి గా సాగిన సెమీఫైనల్ పోరాటం లో తొలిసెట్ ను 4-6 తో ఓడిపోయిన సానియా జంట రెండవ సెట్లో 2-1 తో వెనుకబడి వున్నప్పుడు వర్షం అంతరాయం కలిగించింది. విరామం తర్వాత చెలరేగి ఆడిన వీరు రెండవ సెట్ తో పాటు మ్యాచ్ ను కైవసం చేసుకున్నారు.
వరుసగా 29 వ విజయం సాధించటం ద్వారా 1994 లో గిగి ఫెర్నాండేజ్ (ప్యూర్టారికో ) /నతాలియా జ్వేరేవా (బెలారస్) జంట నెలకొల్పిన 28 వరుస విజయాల రికార్డును బ్రేక్ చేసారు. ఇప్పటికే 10 టైటిళ్ళు సాధించిన ఈ జంట 11 వ టైటిల్ విజయానికి కేవలం ఒక అడుగు దూరం లో వుంది.
Post a Comment