స్పీకర్ కుర్చీలో గీతారెడ్డి |
కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి ఇవాళ కాసేపు శాసనసభ స్పీకర్ గా కార్యకలాపాలు నిర్వహించారు. స్పీకర్ మధుసూదనా చారి అనారోగ్య కారణాలతో ( వడదెబ్బ??) సభకు హాజరు కాకపోవటం, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి కాసేపు సభలో లేకపోవటం తో గీతారెడ్డి ఈ బాధ్యతలు నిర్వహించాల్సి వచ్చింది.
అయితే శాసన సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లతో పాటు మొత్తం ఏడుగురు ప్యానెల్ స్పీకర్లు ఉంటారు. ప్యానెల్ స్పీకర్లలో ప్రతిపక్ష సభ్యులు కూడా ఉంటారు. ఇవాళ వారందరిలో సీనియర్ కావటంవల్ల గీతారెడ్డికి అవకాశం వచ్చింది.

Post a Comment