హుస్సేన్‌సాగర్‌లో సీప్లేన్లు |
హుస్సేన్ సాగర్ లో బోటు లో విహరించి హెలికాప్టర్ లో నగర విహారం చెయ్యాలనుకున్తున్నారా? ఇప్పుడు దీనికి రెండు సర్వీసులు అవసరం లేదు. కొత్తగా వచ్చే సీప్లేన్లు ఈ రెండు అనుభవాలను అందించనున్నాయి. నగరం లో హెలీటూరిజం విజయవంతం కావటం తో ఉత్సాహంలో ఉన్న తెలంగాణ పర్యాటక శాఖ త్వరలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించనుంది. దీనికోసం ఒక్కొక్కరు 3 వేల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. పౌర విమానయాన శాఖ అనుమతిస్తే 15 ఏప్రిల్ నుండి ఇవి ప్రారంభం కానున్నాయి.
దీనికి అదనంగా నగర పర్యాటకులకు డక్ బస్ సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది. రోడ్ పై బస్ లా నీటి పై బోటు లా ప్రయాణించటం వీటి ప్రత్యేకత. హైదరాబాద్‌లో 10 -12 సీట్లుండే సీప్లేన్లు నడిపేందుకు కొచ్చిన్, ఢిల్లీ కేంద్రాలుగా ఉన్న రెండు పర్యాటక సంస్థలు ముందుకొచ్చాయి.
హుస్సేన్‌సాగర్‌లో డక్ బస్ లు |
Post a Comment