కెసిఆర్ చెల్లని పైసల సిద్ధాంతం

కెసిఆర్ చెల్లని పైసల సిద్ధాంతం
కెసిఆర్ చెల్లని పైసల సిద్ధాంతం
కొత్త సిద్దాంతాలు కనిపెట్టడంలో, సరికొత్త సూత్రీకరణలు చేయటంలో తెరాసని, కెసిఆర్ ని మించిన వాళ్ళు ఎక్కడా కనిపించరు. గత సార్వత్రిక ఎన్నికల సందర్బంలో కెసిఆర్ కనిపెట్టిందే ఈ చెల్లని పైసల సిద్దాంతం. నిజామాబాద్ రూరల్ ఎన్నికల సందర్బంగా బాజిరెడ్డి గోవర్ధన్ తరపున ప్రచారం చేస్తూ ప్రజలను నిజామాబాద్ టౌన్ లో చెల్లని రూపాయి ఇక్కడ రూరల్ లో చెల్లుతుందా అని అడిగినప్పుడు ప్రజలనుండి విశేష స్పందన లభించింది. అప్పటికే రెండుసార్లు నిజామాబాద్ టౌన్ లో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన డి శ్రీనివాస్ రూరల్ ఎన్నికలలో గోవర్ధన్ ప్రత్యర్థి గా నిలబడటమే దీనికి కారణం.

తాజాగా మెదక్ ఉప ఎన్నికలలో ఇదే అస్త్రాన్ని హరీష్ రావు జగ్గారెడ్డి, సునీత లక్ష్మా రెడ్డి ల పైన ఉపయోగిస్తున్నాడు. గత ఎన్నికలలో సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం లో జగ్గారెడ్డి, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం లో సునీత లక్ష్మా రెడ్డి ఓడిపోయిన సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు చెల్లని రూపాయలని, నర్సాపూర్, సంగారెడ్డి ల లోనే చెల్లని పైసలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం అంతటా ఎలా చెల్లుతాయని ప్రచారం చేస్తున్నారు.

Post a Comment

Note: only a member of this blog may post a comment.

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget