వాసుదేవ ద్వాదశి

వాసుదేవ ద్వాదశి
వాసుదేవ ద్వాదశి రోజు ప్రధానంగా కృష్ణుడికి సంబంధించినది. తొలి ఏకాదశి తర్వాతరోజు జరుపుకోవాలి కానీ, ఏకాదశి మిగులు రోజు జరుపుకోవటం మూలాన ఎక్కువసార్లు వాసుదేవ ద్వాదశి, తొలి ఏకాదశి ఒకే రోజు వస్తాయి. చాతుర్మాస్య వ్రతం తొలి ఏకాదశి నుండి ప్రారంభించాలని మిగిలిన పురాణాలు చెబుతుండగా, వాసుదేవ ద్వాదశి నుండి ప్రారంభించాలని స్మృతి కౌస్తుభం చెబుతుంది. 

ఏకాదశి రోజు శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్ర వ్రతం మొదలుపెట్టక పోవటంతో, ద్వాదశి రోజు ఆమెకు కృష్ణుడు(వాసుదేవుడు) గోపద్మ వ్రతాన్ని ఉపదేశించి ఐదు సంవత్సరాల వ్రతాన్ని ఒకేసారి పూర్తి చేయించాడని ఒక కథనం ఉంది. దాని ప్రకారమే ఈ రోజు వాసుదేవ ద్వాదశిగా ప్రసిద్ధి చెందిందని భావిస్తారు. 

వాసుదేవ ద్వాదశి రోజు ప్రత్యేకంగా ఆచరించవలసిన విధానాల గురించి పురాణాలలో ఎక్కడా ప్రత్యేకంగా చెప్పబడలేదు. ఈ రోజు ప్రత్యేకంగా ఉపవాసము చేయవలసిన అవసరము లేదు. ఏకాదశి, గోపద్మ, చాతుర్మాస్య వ్రతాలు చేసేవారు ఆయా వ్రత నియమాల ప్రకారం మసలుకోవాలి. వాసుదేవ ద్వాదశి అని ప్రత్యేకంగా పేర్కొంటున్నాం కాబట్టి విష్ణు సహస్ర నామం పఠించటం, గోపద్మ వ్రత కథను చదవటం లాంటివి శ్రేయస్కరం. 

0/Post a Comment/Comments

Previous Post Next Post