ఉత్తరాయణ పుణ్య విధులు

ఉత్తరాయణ పుణ్య విధులు
ఉత్తరాయణ పుణ్య విధులు 
సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తరదిశలో ఉన్నప్పుడు మకరరాశిలో ప్రవేశించడంతో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ ఉత్తరాయణ పుణ్య కాలం ఆరు నెలల పాటు కొనసాగుతుంది. ఈ సమయాన్ని శారీరక పరిశ్రమకు, పూజలకు, దానాలకు మరియు కృషికి అనువైన కాలంగా పేర్కొంటారు.

సంక్రాంతి విధులు

దానాలు
ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా చక్కని ఫలితాన్నిస్తుంది. ధాన్యం, పండ్లు, విసన కర్రలు, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెఱుకు, బూడిద గుమ్మడికాయ మొదలైనవి దానం చేయాలి. సంక్రాంతి రోజు గోదానం చేయడం వలన మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు.

తిలా తర్పణం
సంవత్సరములో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు ఎక్కువగా వాడరు. కానీ, సంక్రాంతి పర్వదినాన మాత్రం నల్ల నువ్వులతో మరణించిన పితృ దేవతలందరికీ తర్పణములివ్వడం చేస్తుంటారు.

సంక్రాంతి పురుషుడు
ప్రతి సంవత్సరం వేరు వేరు వాహనములపై సంక్రాంతి పురుషుడు వస్తాడు. మట్టితో సంక్రాంతి పురుషున్ని ఆయన వాహనాన్ని తయారు చేసి, సంక్రాంతి మూడు రోజుల్లో పూజలు చేస్తారు.

ఉత్తరాయణ ప్రారంభ సమయాన ధేను దానం, నువ్వుల నూనెతో శివాలయంలో దీపదానం, నువ్వులు, బియ్యం కలిపి శివున్ని పూజించటం, నల్ల నువ్వులతో అభ్యంగన స్నానం, తిల దానం, తిల హోమము, తిల భక్షణం చేయాలనీ, తెల్ల నువ్వులతో దేవ తర్పణం, నల్ల నువ్వులతో పితృ తర్పణం చేయాలని శాస్త్ర వచనం.

0/Post a Comment/Comments

Previous Post Next Post