గత వారం ఎస్వీయూలో మెడికో శిల్ప ఆత్మహత్య చేసుకున్న ఘటన తాలూకు గాయం మానక ముందే, మరో మెడికో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కడప జిల్లాకు చెందిన ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం విద్యార్థిని గీతిక యూనివర్సిటీ హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మానసికంగా దృఢంగా ఉండవలసిన వైద్య విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. లైంగిక వేధింపులా? మానసిక వత్తిడులా? ఇతరత్రా వ్యక్తిగత కారణాలేమైనా ఉన్నాయా? పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. మరో ఆత్మహత్య విషయం తెలియటంతో ప్రొఫెసర్లు, ప్రిన్సిపాల్ హుటాహుటిన హాస్టల్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Post a Comment