ఐటి రంగంలో తెలంగాణ, కర్ణాటకను మించి పోతుందా?

ఐటి రంగం లో తెలంగాణ, కర్ణాటక ను మించి పోతుందా?
ఐటి రంగం లో తెలంగాణ, కర్ణాటక ను మించి పోతుందా?
తెలంగాణ రాష్ట్రం ఐటి రంగం లో గత సంవత్సరం జాతీయ సగటు కంటే ఎక్కువ వృద్ధిని సాధించిందని త్వరలో కర్ణాటక ను మించి పోతుందని, నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించనుందని మీడియా లో వార్తలు వచ్చాయి. గణాంకాలను పరిశీలిస్తే ఇది కేవలం పాక్షికంగా మాత్రమే నిజం.

రాష్ట్రం లో ఐటి వృద్ధి (20%) జాతీయ వృద్ధి (17%) కన్నా ఎక్కువ ఉన్నది నిజమే కానీ అది నెంబర్ వన్ స్థాయికి ఏ మాత్రం దగ్గరలో లేదు. ఇప్పట్లో సాధించేంత సీన్ కూడా లేదు. ఇప్పుడు నెంబర్ వన్ గా ఉన్న కర్ణాటక గత సంవత్సరం ఐటి లో 30% వృద్ధిని సాధించింది. అంటే ఇప్పట్లో అందుకోవటం దాదాపు సాధ్యం కాదు. ఇంకా మాట్లాడితే ఈ విషయంలో తెలంగాణ కనీసం రెండవ స్థానం లో కూడా లేదు. ఐటి ఎగుమతులలో కర్ణాటక మొదటి స్థానం లో ఉండగా, మహారాష్ట్ర రెండవ స్థానంలో, తమిళనాడు మూడవ స్థానం లో ఉన్నాయి. రానున్న కొన్ని సంవత్సరాలలో తెలంగాణ రెండవ స్థానాన్ని సంపాదించవచ్చు. పట్టణాల పరంగా చూస్తే మాత్రం ఐటి ఎగుమతులలో బెంగళూరు (31%) తర్వాత స్థానం హైదరాబాద్ దే(11%). కానీ ఇప్పట్లో బెంగళూరును అందుకోవటం కూడా అసాధ్యమే.

0/Post a Comment/Comments

Previous Post Next Post