ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ నుండి వైదొలగిన అమెరికా

ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ నుండి వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రభుత్వ ప్రతినిధి తెలియజేసారు. ఈ మేరకు అమెరికా ప్రభుత్వ కార్యదర్శి మైక్ పోమ్పే, సమితిలో అమెరికా రాయబారి  నిక్కీ హేలీ నుండి ఇవాళ ప్రకటన వెలువడనుంది. మానవ హక్కుల కౌన్సిల్ లో ప్రతినిధుల కాల పరిమితి మూడు సంవత్సరాలు కాగా, అమెరికాకు ఇప్పటి వరకు ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమే పూర్తయింది. 

47 మంది సభ్యుల ఈ కౌన్సెల్ జెనీవా నుండి పనిచేస్తుంది. గత కొంతకాలం గా అమెరికా, ఈ కౌన్సెల్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపిస్తుంది.  ఇదే నెపంతో దీనిలో పూర్తి స్థాయి లో సంస్కరణలు చేపట్టాలని, లేని పక్షంలో వైదొలుగుతామని బెదిరిస్తూనే ఉంది.  గత కొన్ని రోజులుగా అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో వలస తల్లిదండ్రుల నుండి విడిపోయిన పిల్లలను నిర్బంధించడంతో కూడా అమెరికా, ఈ  కౌన్సెల్ నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది. 

ఈ పరిణామం ఈ మధ్య కాలంలో అమెరికా అనుసరిస్తున్న ఏకపక్ష ధోరణులకు అద్దం పడుతోంది. పారిస్ వాతావరణ ఒప్పందం మరియు ఇరాన్ అణు ఒప్పందాల నుండి కూడా ఏకపక్షం వైదొలగడం గమనార్హం. 

0/Post a Comment/Comments

Previous Post Next Post