ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఎదురు లేదు, ఉండబోదు.

గత ఎన్నికలలో ఓడిపోయేంత వరకూ, దేశంలో ధనికుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పేరు గడించారు. ఆయన 2014 ఎన్నికల అఫిడవిట్‌లో, తనకు 177 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు నిర్దారించారు. ఇప్పుడు ఆయన స్థానంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, తనకు ఏకంగా 510 కోట్ల ఆస్తులున్నట్లు తెలియజేసారు. అంటే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినా దేశంలో ధనిక ముఖ్యమంత్రి స్థానం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి ఢోకా లేదన్నమాట. ఇదే సమయంలో, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కేవలం 15 కోట్ల రూపాయల ఆస్తులతో దేశంలో నాలుగవ స్థానంలో ఉన్నారు.  

మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులు, వారు ఎన్నికల అఫిడవిట్లో దాఖలు చేసిన వివరాల ప్రకారమే ఇలా అగ్రస్థానాల్లో ఉంటే, వాస్తవ విలువల ప్రకారం ఇంకెన్ని రెట్లు ఉంటాయో?, ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం తలసరి ఆదాయం విషయంలో, దేశంలో కేవలం 16వ స్థానంలో (25 రాష్ట్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే) ఉన్నారు. తెలంగాణా వారు 7వ స్థానంలో ఉన్నారు. అంటే మనవి ధనికులు పాలిస్తున్న పేద రాష్ట్రాలన్నమాట.

0/Post a Comment/Comments

Previous Post Next Post