నేడు దేశవ్యాప్తంగా ప్రజా రవాణా బంద్

నేడు దేశవ్యాప్తంగా ప్రజా రవాణా బంద్
కేంద్రం ప్రవేశపెట్టనున్న మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లుకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా ప్రజారవాణా సంస్థలు బంద్‌ పాటించనున్నాయి. ఈ బిల్లును రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్రం లాక్కోవటానికే తెస్తున్నారని, ప్రభుత్వ కార్మికులకు నష్టం కలుగుతుందని, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించేలా ఉందని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. 

వాహన రిపేర్లు కేవలం కంపెనీల సర్వీసు సెంటర్లలో మాత్రమే చేయాలనే నిబంధన ఉండటంతో, చాలామంది సొంతంగా ఉపాధి పొందే మెకానిక్లు పని కోల్పోనున్నారని వారు ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా బంద్ పూర్తి స్థాయిలో జరుగనుంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post